రోహిత్..తండ్రయ్యాడు

70
rohith

రోహిత్ శర్మకు మర్చిపోలేని న్యూఇయర్ గిఫ్ట్. ఆయన భార్య రితికా ముంబైలోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితిక బంధువు సీమాఖాన్‌(నిర్మాత సొహైల్‌ ఖాన్‌ భార్య)సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్న రోహిత్‌ తన బుజ్జి పాపాయిని, భార్యను చూసేందుకు భారత్‌కు తిరుగుపయనమయ్యారు.

2015 డిసెంబరు 13న రోహిత్‌ తన స్నేహితురాలు రితికాను వివాహం చేసుకున్నారు. ఇటీవల రోహిత్‌ తాను త్వరలో తండ్రవబోతున్న విషయాన్ని వెల్లడించారు.

జనవరి 3 నుండి సిడ్నీ వేదికగా జరిగే నాలుగోటెస్టుకు రోహిత్ దూరం కానున్నారు. ప్రస్తుతం నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.