ప్రతీ గ్రామానికి రోడ్డు,రవాణా సౌకర్యం: మంత్రి వేముల

541
vemula prashanth reddy
- Advertisement -

ప్రతి గ్రామానికి రోడ్ ,రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రోడ్ భవనాల శాఖ,కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ లో హెల్త్ అస్సెస్మేంట్ ఆఫ్ బ్రిడ్జెస్ ,స్ట్రక్షర్స్ పై ఒక్క రోజు వర్క్ షాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడిన సిఐడిసి ఇంత మంచి పోగ్రామ్ పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మనుషులకు ఎలాంటి చెక్ ఆఫ్ అవసరమో బ్రిడ్జ్ లకు కూడా అలానే ఉండాలి..బ్రిడ్జ్ లను ఎప్పటికప్పుడు పరిశీలించాలి,వాటి పనితీరును రికార్డ్ చెయ్యాలన్నారు.జూన్ 2 ,2014 నాడు రోడ్స్‌ అవరాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ రూ. 12000 కోట్ల రూపాయలను మంజూరు చేశారని చెప్పారు.

వర్షాల తో కొంత కాజ్ వే లపై నీరు ప్రవహం అవుతుంది..లో లెవల్ కాజ్ వే లను హై లెవల్ కాజ్ వే లుగా మార్చుకోవాలన్నారు. 511 బ్రిడ్జ్ ల నిర్మాణము చేపట్టాలి అని సీఎం కేసీఆర్ చెప్పారు మన తెలంగాణ లో కానీ దేశములో ఎక్కడ కూడా ఇలాంటి నిర్మాణాలు జరగలేదు ఇందులో 400 బ్రిడ్జ్ లలో పూర్తి అయ్యాయని చెప్పారు.

హైదరాబాద్ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కట్టడాలు నిర్మాణం చేపడుతున్నాం..గోదావరి నది పెద్ద బ్రిడ్జ్ ల నిర్మాణం జరుగుతుంది..బ్రిడ్జ్ లతో పాటు చెక్ డ్యామ్ ల నిర్మాణము కూడా చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. చెక్ డ్యామ్ లతో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది దీనితో రైతులకు మేలు జరుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో వర్క్ షాప్ పెట్టుకోవడం చాలా సంతోషం అన్నారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం గతంలో ఇలాంటి జరిగేవి కావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ లకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది….రోడ్స్ భవనాల పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఎక్కువ కాలం మన్నిక ఉండేవిధంగా రోడ్స్ నిర్మాణం చేపడుతున్నాం…పాత బ్రిడ్జి లను తొలగించి కొత్తవి నిర్మాణం చేపట్టాం అని చెప్పారు.

- Advertisement -