బూర కొంపముంచిన రోడ్డు రోలర్..!

325
boora narsaiah goud
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్‌ టీఆర్ఎస్‌ అభ్యర్థుల గెలుపును శాసించగా తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అలాంటి సీన్‌ రీపిటైంది. భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి స్వతంత్ర అభ్యర్థి ఓ కారణమయ్యారు. చివరివరకు ఉత్కంఠరేపిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో చివరకు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం 5 వేల ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ గెలుపుపై ఎంతో ధీమాగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ ..కారు స్పీడుకు స్వతంత్ర అభ్యర్ధి లింగంకు కేటాయించిన రోడ్డు రోలర్ ప్రతిబంధకంగా మారింది. రోడ్డు రోలర్‌..ట్రక్కు గుర్తును పోలిఉండటంతో ఆయన ఓటమి పాలయ్యారు.

సీపీఐ అభ్యర్థి గోద శ్రీరాములుకు 28135 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన లింగంకు 27,973 ఓట్లు వచ్చాయి. ఆయనకు కేటాయించిన రోడ్డు రోలర్‌..కారును పోలిఉండటంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇవన్నీ టీఆర్ఎస్‌కు పడే ఓట్లేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కేవలం 5 వేలు మాత్రమే. స్వతంత్ర అభ్యర్థికి పడిన ఓట్లలో కనీసం సగం ఓట్లు టీఆర్ఎస్‌కు పడినా ఫలితం వేరేలా ఉండేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎయిమ్స్,కేంద్రీయ విద్యాలయం వంటి ఎన్నో అద్బుతమైన విజయాలను నమోదుచేసి నిత్యం ప్రజల మధ్య ఉండే బూర ఓటమిని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్‌ ట్రక్కు, ఆటో, ఇస్త్రీ పెట్టే లాంటి గుర్తులతో టీఆర్ఎస్‌ పలు సీట్లలో గెలిచే అవకాశాన్ని కొల్పోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసిన సీఎం కేసీఆర్‌ ..టీఆర్ఎస్ సింబర్‌ కారు డూప్‌లను ఎవరికీ కేటాయించొద్దని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇలాంటి పొరపాటు జరక్కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఆ సమయంలో రోడ్డు రోలర్‌ పేరును ప్రస్తావించకపోవడంతో ఒక ఎంపీ స్ధానాన్ని టీఆర్ఎస్ కొల్పోయింది.

- Advertisement -