ధోని రికార్డ్ బ్రేక్ చేసిన రిషబ్ పంత్

184
Rishabh-Pant

వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. గుయానా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మూడో టీ20లో 42 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సులతో మొత్తం 65 పరుగులు చేశారు. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు రిషబ్. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డ్ బ్రేక్ చేశాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 2017లో బెంగళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 56 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.