పారా విజేతలకు ‘పద్మా’లు

222
- Advertisement -

వైకల్యం శరీరానికే కాని సవాళ్లకు కాదని చాటి చెప్పిన ఈ అథ్లెట్ల విజయగాథ కోట్ల మందికి స్ఫూర్తిదాయకం. ఒలింపిక్స్‌లో కనీసం పది పతకాలైనా తెస్తారని భావించిన భారత క్రీడాభిమానుల ఆశలపై మన అథ్లెట్లు నీళ్లు చల్లారు. చివర్లో రెండు పతకాలు వచ్చాయన్న సంతృప్తి మిగిలినా ఎక్కడో ఏదో తెలీని వెలితి. చరిత్రలో ఎన్నడూ లేని ఒకే పారాలింపిక్ టోర్నీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించి అభిమానులకు వెల కట్టలేని ఆనందం అందించారు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా పతకాలు నెగ్గిన మన క్రీడారులు.. అలాగే ఆ ఈవెంట్ పాల్గొన్న మొత్తం 19 మంది భారత ప్లేయర్లు మనందరికీ స్ఫూర్తిదాయకం.

పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారిని దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులకు సిఫారసు చేయనున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ తెలిపారు. పురుషుల హై జంప్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్‌ తంగవేలు, పురుషుల జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించిన దేవేంద్ర ఝఝారియా, మహిళల షాట్‌పుట్‌ విభాగంలో రజతం సాధించిన దీప మాలిక్‌, పురుషుల హై జంప్‌లో కాంస్యం సాధించిన వరుణ్‌ భాటి పేర్లను హోం శాఖకు సిఫారసు చేయనున్నట్లు గోయల్‌ చెప్పారు.

pm-paralympians

పారాలింపిక్స్‌లో 1968 నుంచి పోటీపడుతున్న భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఒకే పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. చిన్నప్పుడే ప్రమాదంలో కాలు కోల్పోయిన తమిళ తంబి తంగవేలు మారియప్పన్ హైజంప్‌లో పసిడితో ఘన బోణీ కొట్టగా.. పోలియో కారణంగా వికలాంగుడిగా మారిన వరుణ్ సింగ్ భాటి కాంస్యం కొల్లగొట్టాడు. శస్త్రచికిత్సల వల్ల చక్రాల కుర్చీకి పరిమితమైన దీపా మాలిక్ షాట్‌పుట్ రజతం గెలిచి పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించగా.. ఎనిమిదేళ్లవయసులో విద్యుదాఘాతానికి ఓ చేరుుకోల్పోరుున దేవేంద్ర జజారియా పారాలింపిక్స్‌లో రెండో స్వర్ణం నెగ్గిన భారత తొలి పారాఅథ్లెట్‌గా ఘనత వహించాడు.

- Advertisement -