పవన్‌పై వర్మ సంచలన వ్యాఖ్యలు..

70

వివాదాల దర్శకుడు రాంగోపారల్‌ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తనను ఓడించడానికి ప్రత్యర్థులు రూ. 150 కోట్లను ఖర్చు చేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తనదైన శైలిలో స్పందించారు.

పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమేనన్న వర్మ, పవన్‌ను నిజంగా గెలిపించాలని ఓటర్లు అనుకుంటే, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా, అతనికే ఓటేసేవారని వ్యాఖ్యానించారు. తాను సేవ చేయాలని అనుకున్న ప్రజలు అవినీతిపరులన్నట్టుగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

RGV

కాగా, నిన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో భీమవరంలో తనను ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసిందని, శాసనసభలో తాను అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనేదే దాని వెనుక లక్ష్యమని అన్నారు.

ప్రజా తీర్పును గౌరవిస్తానని, ఒక్క ఓటమి తమ పార్టీని నిలువరించబోదన్నారు. తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదని, విజయం సాధించే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.