రివ్యూ : స్పైడర్

315
Review Spyder
- Advertisement -

మహేష్ బాబు గత చిత్రం బ్రహ్మోత్సవం భారీ అంచనాల నడుమ రిలీజై బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. అందుకే ఈసారి చాలా జాగ్రత్తలతో సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ మురుగదాస్ తో సినిమా చేసి, మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఎప్పటి నుంచో సూపర్ స్టార్ అభిమానులు చూడాలనుకుంటున్న హాలీవుడ్ సీక్రెట్ ఏజెంట్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందన్న టాక్ తో, సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో మహేష్‌ హిట్ కొట్టాడా లేదా చూద్దాం…

కథ:

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ మన దేశంలో ఎలా పనిచేస్తుంది. వారు దేశంలో మన కోసం ఏం చేస్తున్నారు అనేదే ప్రధానాంశంగా సినిమా తెరకెక్కింది.  శివ (మహేష్‌బాబు) ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఒక గూఢాచారి (స్పై ఆఫీసర్).  ప‌బ్లిక్ ఫోన్ కాల్స్ సీక్రెట్‌గా వింటూ ఎవ‌రైనా ఆప‌ద‌లో ఉంటే వెంట‌నే వాళ్ల‌ను ఆ ఆప‌ద నుంచి సేవ్ చేస్తుంటాడు. ఇలా ఓ రోజు మెడిక‌ల్ స్టూడెంట్ అయిన ర‌కుల్‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారుతుంది. ఆ త‌ర్వాత ఓ రోజు శివ‌కు వ‌చ్చిన ఫోన్ కాల్‌తో ఓ అమ్మాయి ఆప‌ద‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఆమెను కాపాడేందుకు శివ ఓ లేడీ కానిస్టేబుల్‌ను పంపుతాడు. వీరిద్ద‌రు హ‌త్య‌కు గుర‌వుతారు. క‌ట్ చేస్తే ఈ రెండు హ‌త్య‌ల గురించి ఇన్వెస్ట్‌గేష‌న్ చేసే క్ర‌మంలో చాలా హ‌త్య‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ హత్యలకు  కారణం ఎంటీ..?నిందితుడిని ఎలా పట్టుకున్నాడు..?అనేదే స్పైడర్ కథ.

Review Spyder

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ మ‌హేష్ యాక్టింగ్‌, దర్శకత్వం,  ఎడిటింగ్‌, నేప‌థ్య సంగీతం, సెకండాఫ్‌. గూఢాచారి శివ పాత్రలో మహేష్‌బాబు అదరగొట్టేశాడు. తన హ్యాండ్‌సమ్ లుక్స్‌తో కట్టిపడేస్తూనే.. ‘స్పై’గా ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరోయిన్ ర‌కుల్‌ పర్వాలేదనిపించింది. విల‌న్‌గా చేసిన సూర్య చూడ‌డానికి బ‌ల‌మైన విల‌న్ కాకున్నా మెంట‌ల్‌గా బాగా బ‌లంగా ఉన్న విల‌న్‌గా న‌టించాడు. ఇప్పటివరకు నవ్వించిన ప్రియదర్శి ఇందులో భిన్నమైన రోల్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మిగతావాళ్లంతా తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్  కామెడీ లేక‌పోవ‌డం, ప్లాట్ న‌రేష‌న్‌. సినిమాలో రొమాంటిక్ ట్రాక్‌, కామెడీకి పెద్ద‌గా స్కోప్ లేదు. కొన్ని సీన్లు బోరింగ్‌గా ఉన్నా వాటిని సాగ‌దీసేందుకు ద‌ర్శ‌కుడు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో సినిమా మ‌రీ బోర్ కాలేదు. ఎక్క‌వ బ‌ల‌హీన‌మైన సీన్ల మ‌ధ్య‌లో కొన్ని మైండ్ బ్లోయింగ్ సీన్లు ఉంటే ఎలా ఉంటుందో ? ఈ సినిమా కూడా అలాగే ఉంది.

Review Spyder
 
సాంకేతిక విభాగం :

సినిమాకు సాంకేతికంగా మంచిమార్కులే పడతాయి.  సంతోష్ శివ‌న్ అందించిన సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. హ‌రీష్ జైరాజ్ మ్యూజిక్‌లో ఆర్ఆర్ అదుర్స్‌. ఎడిటింగ్ బాగుంది. ర‌న్ టైం త‌క్కువుగా ఉండ‌డంతో సినిమా స్పీడ్‌గా ముందుకు వెళ్లింది. ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ రొటీన్ లైన్ తీసుకున్నా త‌న మార్క్ డైరెక్ష‌న్ చూపించాడు. నిర్మాణ విలువలకు ఎక్కడా వంకపెట్టడానికి లేదు.

తీర్పు:

బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత మహేష్ భారీ అంచనాల మధ్య నటించిన సినిమా  స్పైడర్.  మురగదాస్- మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ కావడంతో విడుదలకు ముందు భారీ హైప్ క్రియేటైంది. మహేష్ నటన, మురగదాస్ దర్శకత్వం,ఎడిటింగ్ సినిమాకు ప్లస్ కాగా కామెడీ లేకపోవడం, ప్లాట్ నారేషన్ సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా  మహేష్ అభిమానులకు నచ్చే మురగదాస్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్.

విడుదల తేదీ:27/09/2017
రేటింగ్ :3/5
నటీనటులు: మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్
సంగీతం: హారిస్ జయరాజ్
నిర్మాత: ఠాగూర్ మథ, ప్రసాద్ ఎన్వీ
దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్

- Advertisement -