బీజేపీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి? అదే బాటలో మరికొంత మంది..

789
revanth-reddy-komatireddy
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి ఉనికిని కోల్పోతుందని చెప్పుకోవాలి. ఇటివలే సీఎల్పీ విలీనంతో ఆ పార్టీకి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఇక పార్టీలో ఉన్న నేతలు కూడా ప్రత్యామ్మాయంకోసం వెతుకుతున్నారట. ఇప్పట్లో కాంగ్రెస్ కొల్కునే పరిస్దితి లేకపోవడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా 4పార్లమెంట్ స్ధానాలు గెలిచింది బీజేపీ.

ఎలాగైన 2024 తెలంగాణలో పార్టీని బలంగా చేయాలని చూస్తున్నారు ఢిల్లీ నేతలు. అందుకోసం కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తో ఇద్దరూ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో వారు రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం.

కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు రామ్ మాధవ్ తో సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది. వారితో పాటు మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరికొంత మంది నేతలు కూడా బీజేపీలో చేరుతారని సమాచారం. ఈఇద్దరూ ఎంపీలు గనుక బీజేపీలో చేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయినట్లే అని చెప్పుకోవాలి.

- Advertisement -