నాకు మతం జబ్బులేదు :మాధవన్

279

తనకు అన్ని మతాల వాళ్లు సమానమేనని అందరికి తమ ఇంట్లోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు సినీ నటుడు మాధవన్. తాను హిందువునైతే వేరే మతానికి సంబంధించిన చిహ్నం తన ఇంట్లో ఉండకూడదా అంటూ ప్రశ్నలు గుప్పించారు.

రాఖీ పండగ సందర్భంగా తన తండ్రి,కొడుకుతో పాటు దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే ఈ ఫోటో వెనుక భాగంలో శిలువ ఉండటాన్ని గమనించిన ఓ మహిళా నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మీ పూజ గదిలో శిలువ ఎందుకు ఉంది? శిలువ అక్కడ ఉండటం వల్ల మీపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నారని ట్వీట్‌లో మండిపడింది. మీరు హిందూ సాంప్రదాయాలను ఆచరిస్తున్నారనేది పూర్తిగా ఫేక్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనికి ఘాటుగా స్పందించారు మాధవన్‌. ముందు మీకు పట్టిన మతం రోగం త్వరలో నయం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. మీలాంటి వాళ్ల వల్ల గౌరవం కోల్పోవడం వల్ల నాకు వచ్చిన నష్టం లేదు…అన్ని మతాలను మా కుటుంబం విశ్వసిస్తుందని చెప్పారు.

ప్రతి మతానికి మా ఇంట్లో ప్రవేశం ఉంది. మీకు కనిపించలేదనుకుంటా.. ఆ ఫొటోలో గోల్డెన్‌ టెంపుల్‌ కూడా ఉందని చురకలంటించారు. తనకు ఎలాంటి జబ్బు లేదని …గుడి, చర్చ్, దర్గా దేనికైనా వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు.

mahdavan