పబ్లిక్ గార్డెన్ జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్ తమిళిసై

184
tamilisai

హైదరాబాద్ లోని పబ్లిక్ గార్జెన్ లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధిగి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముదు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్‌ స్వీకరించారు.