‘బిగ్ బాస్’ స్థానంలో మరో రియాల్టీ షో..

262
Renu Desai to host dance reality show
- Advertisement -

బిగ్‌ బాస్‌ షో తెలుగు బుల్లితెరపై ఓ సంచలనం అని చెప్పాలి. ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా నిర్వహిస్తున్న ఈ షో విజయవంతంగా ప్రసారమవుతూ ప్రేక్షకుల మన్ననలందుకుంటోంది. గత గొద్ది రోజులుగా దిగ్విజయంగా ప్రసారవమవుతూ వస్తున్న ఈ షో మరికొద్ది రోజుల్లో మొదటి సీజన్‌ను ముగించుకోబోతోంది. సెలెబ్రిటీల గొడవలు, టాస్క్‌లు, ఎలిమినేషన్‌లు, ఏడ్పులు, వైల్డ్ కార్డు ఎంట్రీలు, హాట్ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేసుకున్న ఈ షో ముగింపు అంకం దగ్గర పడింది. మరికొన్ని రోజుల్లో బిగ్‌ బాస్‌ మొదటి విజేత ఎవరనే విషయం తేలనుంది.

Renu Desai to host dance reality show

అయితే ఈ ‘బిగ్ బాస్’ షో త్వరలో ముగియనుండడంతో ఆ స్థానంలో ఒక రియాలిటీ డాన్స్ షోను ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘స్టార్ ప్లస్’ లో వస్తోన్న ‘నాచ్ బలియే’ తరహాలో ఈ డాన్స్ షో వుంటుందట. ఈ కార్యక్రమానికి ముగ్గురు న్యాయ నిర్ణేతలుగా ఉంటారని సమాచారం.

Renu Desai to host dance reality show

కొన్ని రోజుల క్రితమే ఒక న్యాయ నిర్ణేతగా రేణు దేశాయ్‌ను తీసుకున్నారు. మిగతా ఇద్దరు న్యాయ నిర్ణేతలుగా జానీ మాస్టర్‌ను ఆదా శర్మను తీసుకున్నారనేది తాజా సమాచారం. జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ఆదా శర్మ విషయానికి వస్తే, హీరోయిన్ అని మాత్రమే ఆమెను ఎంపిక చేయలేదట. కథక్ నృత్యంలోను .. వెస్ట్రన్ డాన్సుల్లోను ఆమెకి మంచి నైపుణ్యం ఉందట. ఈ కారణంగానే ఆమెను తీసుకోవడం జరిగిందని చెబుతున్నారు.

- Advertisement -