వాళ్ల నుంచి మనం చాలా నేర్చుకోవాలిః రేణు దేశాయ్

161
Renu Deshai

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా రేణు దేశాయ్ తన అనుభవాన్ని పంచుకుంది. రేణు దేశాయ్ నటిస్తున్న చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతుంది. నిన్న సాయంత్రం షూటింగ్ పూర్తిచేసుకుని వస్తుండగా హైదరాబాద్ కు దగ్గరల్లోని ఓ పల్లెటూరి నుంచి వస్తుండగా.. నాకు అప్పుడే హైదరాబాద్ వెళ్లాలనిలేదని ప్రొడక్షన్ డిజైనర్‌తో అన్నాను. అప్పుడే మేము ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయ్యింది.

దీంతో కారు దిగి కాసేపు గ్రామస్తులతో గడిపింది. రేణు దేశాయ్ గ్రామానికి రావడంతో సంబరపడిపోయారు. వాళ్లకు తినడానికి లేకపోయినా సరే ఆమెకు ఉప్మా, టీ ఇచ్చారు. చలిగా ఉండటంతో మంట కూడా వేశారు. ఆ రాత్రి ఆమె వారితోనే అలా నిద్రపోయింది. ఈ విషయాలను రేణూ దేశాయ్‌ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఏం లాభం దానం చెయ్యడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ వాళ్లు తమ దగ్గర ఏమీ లేకపోయినా మనకు ఎన్నో ఇచ్చారు. వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ పేద కుటుంబాల గొప్పదనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రేణు దేశాయ్‌.

View this post on Instagram

. Chilling with my chill buddies right now😁

A post shared by renu desai (@renuudesai) on