రెండో పెళ్లి ఆగిపోలేదు : రేణు దేశాయ్‌

272
renudesai

తన రెండో పెళ్లి ఆగిపోయిందని వస్తుందన్న వార్తల్లో నిజం లేదని సినీనటి రేణు దేశాయ్ తెలిపారు. ఎంగేజ్‌మెంట్ జరిగి చాలా రోజులు జరిగిన పెళ్ళి గురించి ఎలాంటి వార్తలు రాకపోయే సరికి రేణు రెండో పెళ్లి ఆగిపోయిందంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పుకార్లపై క్లారిటీ ఇచ్చారు రేణు. త‌న‌కి సంబంధించిన కొన్ని ఫోటోల‌ని షేర్ చేస్తూ ఇవి నాకు కాబోయే భ‌ర్త తీసాడంటూ కామెంట్ పెట్టింది. ఫియాన్సీ గారికి థాంక్స్ అంటూ కామెంట్ చేసిన రేణు అతిత్వరలో పెళ్లి ఉంటుందని హింట్ ఇచ్చింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ కొద్ది రోజుల క్రితం రెండో వివాహం చేసుకోబోతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమె ప్ర‌క‌ట‌న త‌ర్వాత ప‌వన్ ఫ్యాన్స్‌ సోష‌ల్ మీడియా ద్వారా రేణూని ట్రోల్ చేశారు.దీంతో సహనం కొల్పోయిన రేణూ.. ప‌వ‌న్ అభిమానుల‌పై నిప్పులు చెరిగింది. తాజాగా మరోసారి పెళ్లి ఆగిపోయిందని ప్రచారం జరుగుతుండటంతో క్లారిటీ ఇచ్చింది రేణు. ప్ర‌స్తుతం త‌న కొత్త సినిమా స్క్రిప్ట్ ప‌నుల‌లో బిజీగా ఉన్న రేణూ ఛాన్స్ ఇస్తే బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తానంటుంది.