‘అ!’ లో రెజీనా..ఫస్ట్‌లుక్‌

326
Regina Cassandra First Look from AWE Movie
- Advertisement -

రెజీనా కసాండ్రా ఈ అమ్మడిని గత కొంత కాలంగా అపజయాలతో ఇబ్బంది పడుతోంది. కానీ తన నటనతో అలాగే గ్లామర్ షోతో అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది. ఇక అసలు విషయానికి వస్తే రెజీనా అప్పుడపుడు కొన్ని గ్లామర్ ఫొటో షూట్స్ తో కనిపిస్తూ ఉంటుంది. ఆ విషయం అందరికి తెలిసిందే. కానీ రీసెంట్ గా ఆమెకు సంబందించిన ఒక ఫొటోను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

చేతులు, వీపుపై టాటూలు, మోడ్రన్‌ కేశాలంకరణతో ఈ ఫొటోలో ఉన్న ఈ అమ్మడి ఫోటోని వాల్‌ పోస్టర్‌ సినిమా సంస్థ ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది. నేచురల్‌ స్టార్‌ నాని నిర్మిస్తున్న చిత్రం ‘అ!’. కాజల్‌, నిత్యా మేనన్‌, రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నిత్య, అవసరాల, ఈషా రెబ్బాల ఫస్ట్‌లుక్‌లను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా బుధవారం ‘అ!’ సినిమాలో రెజీనాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను వాల్‌ పోస్టర్‌ సినిమా సంస్థ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అయితే ఇవాళ రెజీనా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Regina Cassandra First Look from AWE Movie

‘అ!’ చిత్రంలోని చేపకు నాని, మొక్కకు రవితేజ వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్‌ పూర్తైనట్లు నిర్మాత నాని చెప్పారు. విభిన్న కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు తెరపైకి ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని తెలిపారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -