‘RRR’ లో ప్రభాస్?

376
RRR Prabhas
- Advertisement -

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈసినిమా గురించి ఎప్పటి కప్పుడు అప్ డేట్స్ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు తారక్, చరణ్ అభిమానులు. తాజాగా ఈమూవీ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈమూవీలో ప్రభాస్ కూడా భాగం కానున్నాడని తెలుస్తుంది. అయితే ప్రభాస్ యాక్టింగ్ కాకుండా తన వాయిస్ ఈసినిమాలో ఉండనుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ .. చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను అసలు కథలోకి తీసుకెళతారట. ఈ రెండు పాత్రలను గురించిన వాయిస్ ఓవర్ రాజమౌళి సిద్ధం చేయించాడని సమాచారం. ఈవాయిస్ ఓవర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ తో చెప్పిస్తే సినిమాకు మరింత ప్లస్ గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు దర్శకుడు రాజమౌళి.

ప్రభాస్ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. రాజమౌళి, ప్రభాస్ ల మధ్య సాన్నిహిత్యం వల్లే తాను ఈసినిమాకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఒక వేళ ప్రభాస్ మాత్రం ఈసినిమాకు వాయిర్ ఓవర్ ఇస్తే ముగ్గురు స్టార్ హీరోల అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.. ఈ రూమర్ పై చిత్ర యూనిట్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

- Advertisement -