ఆగస్టు 15 నుంచి రియల్‌ టైమ్‌ పాలన:సీఎం కేసీఆర్

539
kcr trs
- Advertisement -

ఆగస్టు 15వ తేదీ నుంచి రియల్ టైమ్ పరిపాలనా సంస్కరణలు తీసుకురాబోతున్నామని చెప్పారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ మున్సిపల్ చట్టం -2019పై శాసనసభలో చర్చ జ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ .. ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో భారీ జరిమానా ఉంటుందన్నారు. ఇంటి కొలతల విషయంలో అబద్ధాలు చెప్తే 25 రెట్లు జరిమానా విధిస్తామని చెప్పారు.

ప్రజలెవరూ అధికారులకు లంచానలు ఇవ్వొద్దని..అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దన్నారు. అక్రమమైన బిల్డింగ్ కడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పారు.

కొత్త మున్సిపల్ చట్టం కఠినంగా ఉంటుందని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అద్భుతంగా పని చేస్తామని చెప్పారు. భారతదేశం అబ్బురపడే విధంగా కొత్త మున్సిపల్ చట్టం తీసుకురాబోతున్నామని కొత్త చట్టం పూర్తి పారదర్శకత వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

- Advertisement -