పాయల్ రాజ్ పుత్ ‘ఆర్ డి ఎక్స్ లవ్’ ట్రైలర్..

476

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషనల్ హీరోయిన్‌గా మారిన పాయల్ రాజ్ పుత్, హుషారు ఫేమ్ తేజస్ కంచెర్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్ డి ఎక్స్ లవ్’. ఇటీవల ఈ సినిమాలోని పాయల్ స్టిల్స్ ను అలాగే టీజర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. టీజర్‌తో ప్రేక్షకుల అంచనాలు పెంచేసింది. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

rdx lovie

లవ్.. రొమాన్స్.. యాక్షన్.. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీనియర్ నరేశ్.. నాగినీడు.. ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ ఆమని ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.