రూ.10 నాణేలపై స్పష్టత ఇచ్చిన ఆర్బీఐ..

336
Rs 10 Coins
- Advertisement -

పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని, లావాదేవీల సందర్భంగా వీటిని అనుమతించవచ్చని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తాజాగా స్పష్టం చేసింది. 10 రూపాయల నాణాలు చెల్లవంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని, పది రూపాయల నాణాలు స్వీకరించవచ్చని ఏపీ, తెలంగాణ ప్రజలు, వ్యాపారులను ఆర్బీఐ కోరింది.

Rs 10 Coins

అయితే రూ. 10 నాణేలు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ ఎన్నిసార్లు ప్రకటించినా ప్రజల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. చిన్న చిన్ని దుకాణాల నుంచి బస్సుల్లోనూ ఆ నాణేలను అంగీకరించడం లేదు. అవి చలామణీలో ఉన్నప్పటికి చెల్లుతాయో లేదోనన్న అనుమానంతో చాలామంది వ్యాపారులు వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మరోసారి స్పష్టతనిచ్చింది.

రూ. 10 నాణేలతో పాటు చలామణిలో ఉన్న అన్ని రకాల నాణేలు కూడా ఇకపై చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. కొన్ని రకాల నాణేలను కొంత మంది వ్యాపారులు, బ్యాంకుల శాఖలు ఆమోదించడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ప్రకటన జారీ చేసింది. ఎప్పటి కప్పుడు తాము జారీ చేసిన అన్ని రకాల నాణేలను బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు అంగీకరించాల్సిందేనని 10 రూపాయల నాణేలు చెల్లుతాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో వివరించింది.

- Advertisement -