రవితేజ ‘క్రాక్’ విడుదల తేదీ ఖరారు

194
raviteja Crack

మాస్ మాహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డిస్కో రాజా. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఈనెల 24న విడుదలైంది. ఈమూవీ సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ లు హీరోయిన్లుగా నటించారు. ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజకు ఈమూవీ కాస్త ఉపశమనం లభించినట్లే అని చెప్పుకోవచ్చు.. కాగా ఈమూవీ తర్వాత రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి క్రాక్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

krack

రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈమూవీ విడుదల తేదీని ఖరారు చేశారు. మే 8న ఈమూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. క్రాక్ చిత్రంలో రవితేజ పోలీస్‌ ఆఫీస‌ర్ పాత్రలో న‌టిస్తుండ‌గా, సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌పై బీ మధు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో అందాల తార శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్‌ నటిస్తున్నారు. తమిళ నటుడు సముద్రఖని మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈమూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.