గోవా బీచ్ లో “డిస్కో రాజా”

231
Disco Raja

మాస్ మాహారాజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం డిస్కో రాజా. వీఐ ఆనంద్ ఈసినిమాకు దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీని డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

ఇటివలే ఫారిన్ లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈచిత్ర యూనిట్..తాజాగా గోవా బీచ్ లో తదుపరి సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు. ఈ షూటింగ్ లో హీరోయిన్లు నభా నటేశ్, పాయల్ రాజ్ పుత్ లు పాల్గోనున్నారు. సునీల్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈమూవీపై భారీగా అంచనాలున్నాయి.

ఇక రవితేజ కూడా ఈమూవీపై భారీగా ఆశలు పెట్టుకున్నాడనే చెప్పుకోవాలి. ఈమూవీకి సంబంధించి ఇటివలే రవితేజ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఈమూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు సమచారం.