రవితేజ ‘క్రాక్’ టీజర్ విడుదల

422
Krack Teaser
- Advertisement -

మాస్ మాహారాజ రవితేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం క్రాక్. గోపిచంద్ మలినేని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న‌ క్రాక్ సినిమాని 2020, మే 8న విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.

చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివ‌రాత్రి పండుగ సందర్భంగా ఈమూవీ టీజర్ ను విడుదల చేశారు. రవితేజ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన డాన్ శ్రీను, బలుపు సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుండటంతో ఆసక్తి నెలకొంది.’

- Advertisement -