జడేజాకు అర్జున అవార్డు..

508
jadeja
- Advertisement -

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకి నామినేట్ అయ్యాడు. జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారుల్ని అర్జున అవార్డుకు నామినేట్ చేస్తు ముకుందకమ్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ శనివారం కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకి ప్రతిపాదనలు పంపింది.

రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియాతో పాటు పారా అథ్లెట్‌ దీపా మాలిక్‌ కూడా రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయ్యారు. రియో పారాలింపిక్స్‌లో షాట్‌ పుట్‌లో భారత్‌ తరఫున దీపా మాలిక్‌ వెండి పతాకాన్ని సాధించారు. ఆమె 2017లో పద్మశ్రీ, 2012లో అర్జున అవార్డును అందుకున్నారు.

భారత క్రికెటర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్(మహిళా క్రీడాకారిణి)ల పేర్లను అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు అవార్డులను అందజేస్తారు.

జడేజాకు అర్జున అవార్డుకు నామినేట్ కావడంతో ఈ అవార్డు తీసుకోనున్న 54వ ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. జడేజా కంటే ముందు సునీల్ గవాస్కర్, సచిన్,ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్,గంగూలీ,సెహ్వాగ్, హర్భజన్ ,కోహ్లీ, మిథాలీ రాజ్, స్మృతి మందాన్న  ఈ అవార్డును దక్కించుకున్న వారిలో ఉన్నారు.

- Advertisement -