న్యూ లుక్ లో రవితేజ.. ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

692
Raviteja New look
- Advertisement -

మాస్ మ‌హారాజా ర‌వితేజ గత కొద్ది రోజులుగా ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. గతేడాది ఆయన హీరోగా నటించిన “ట‌చ్ చేసి చూడు”.. “నేల‌టికెట్”.. “అమర్ అక్బర్ ఆంటోనీ” సినిమాలు అభిమానులకు నిరాశను మిగిల్చాయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా డిస్కో రాజా. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు.

ఈసినిమాలో రవితేజ సరసన ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేశ్, ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. అయితే ఈసినిమాలో రవి తేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో ఒక పాత్ర కోసం రవితేజ.. మరి యంగ్‌గా కనిపించాలి. దీనికోసం మాస్‌రాజా బాగానే వర్కౌట్ చేసి తన లుక్‌ను మార్చుకున్నాడు. మీసాలు ట్రిమ్ చేసి.. కాస్తంత స్లిమ్ అయ్యాడు.

ఈఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కథ ప్రకారం ఈ సినిమాలో రవితేజ వృద్దుడిగా కనిపిస్తాడట. ఆ తర్వాత తన శతృవులపై రివేంజ్ తీర్చుకోవడం కోసం యువకుడిగా మారిపోతాడట. వృద్దుడిగా ఉన్న మాస్ రాజా..ఎలా యువకుడిగా మారాడనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. తాజాగా రవితేజ ఫోటోను చేసిన ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

- Advertisement -