రివ్యూః డిస్కోరాజా

1258
Disco-Raja
- Advertisement -

మాస్ మాహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈమూవీలో పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ లు హీరోయిన్లుగా నటించారు. రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య నేడు ‘డిస్కో రాజా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన డిస్కోరాజా మూవీ ఎలా ఉందో చూద్దాం.

కధః

వాసు (రవితేజ) ఓ అనాథ. లధాక్‌లో వాసు పై గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేసి చంపేస్తారు. అక్కడే మంచులో వదిలేసి వెళ్లిపోతారు. ఆయన కోసం ఢిల్లీలో ఆయన కుటుంబం అంతా వేచి చూస్తుంటుంది. అక్కడే నభా నటేశ్ తో ప్రేమలో పడతాడు వాసు. అలాంటి సమయంలో వాసు డెడ్ బాడీని డాక్టర్ పరిణీతి (తాన్యా హోప్) బృందం ల్యాబ్‌కు తెప్పించుకుంటారు. ఛీఫ్ డాక్టర్ తన సైన్స్ ప్రయోగంతో చనిపోయిన వాసును మళ్లీ బతికిస్తాడు. కానీ వాసు గతం మర్చిపోతాడు. తన గతాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో మద్రాస్ వెళ్తాడు. అక్కడ డిస్కో రాజా(రవితేజ) గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. అసలు వాసు, డిస్కో రాజాకు ఏంటి సంబంధం.. వాసును ఎందుకు చంపేస్తారు.. డిస్కో రాజా ఎలా చచ్చిపోతాడు అనేది అసలు కథ..

Raviteja
కథనంః
విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వీఐ ఆనంద్. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాల తర్వాత ఈయన నుంచి వచ్చిన సినిమా డిస్కో రాజా. చనిపోయిన మనిషి మళ్లీ బతికితే ఏం చేస్తాడన్నది ఈమూవీ కథ. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టులు సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేసాయి. అప్పటి వరకు కేవలం రవితేజపైనే కథ నడుస్తుంది. కథ పాతడే అయినా కొత్తగా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పుకొవాలి. ఇస్టార్ట్‌ బ్యూటీ నభా ఈ సినిమాలో కూడా తన అందచందాలతో యువతను కట్టిపడేసింది. రవితేజ నటనతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ ను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. బాబీ సింహాను చంపిన తర్వాత వచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. సునీల్ నటన ప్రక్షకులను ఆకట్టుకుంటుంది. రవితేజ నుంచి వచ్చిన డిఫెరెంట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా డిస్కో రాజా అని చెప్పుకోవాలి.
ప్లస్ పాయింట్స్ః
మాస్ మహారాజా రవితేజ నటనతో ఆకట్టుకున్నాడు. వాసు పాత్రలో రవితేజ జీవించిపోయాడు. బాబీ సింహా కూడా అదరగొట్టాడు. నభా నటేష్, తాన్యా హోప్, పాయల్ రాజ్‌పుత్ పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ అయితే లేదు. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. ముఖ్యంగా తమన్ సంగీతం గురించి చెప్పుకోవాలి. తమన్ ఇచ్చిన సంగీతం ఈసినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఇక కార్తీక్‌ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ లు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి.

disco
మైనస్ పాయింట్స్ః

మధ్యలో కొన్ని సీన్లు ఎందుకు పెట్టారో కూడా అర్ధం కాదు. కథకు సంబంధం లేని కొన్ని సిన్లు బోరింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా కథలో బలం లేకపోవడం. పాత కథను కొత్తగా మలిచిన తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. కొన్ని సీన్లను మరి సాగదీయడంతో ప్రేక్షకులకు బోరింగ్ అనిపించింది.
విశ్లేషణః
వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు ఈమూవీతో కాస్త ఉపశమనం అని చెప్పుకోవాలి. ఇంతకు ముందెన్నడూ కనిపించని ఎనర్జీతో నటించడంతో మాస్ మాహారాజా అభిమానులకు కన్నులపండుగలా అనిపిస్తుంది. గత సినిమాలతో పొల్చుకుంటే రవితేజ కు కమర్షియల్ గా హిట్ వచ్చినట్లే అని చెప్పుకోవాలి.

విడుదల తేదీ: 24/01/2020
రేటింగ్: 2.5/5
న‌టీన‌టులు: రవితేజ, నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, తాన్యా హోప్‌, బాబీ సింహా, వెన్నెల కిశోర్‌, సునీల్‌, సత్య
సంగీతం: త‌మ‌న్‌
నిర్మాత‌లు: రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి
ద‌ర్శ‌క‌త్వం: వీఐ ఆనంద్‌

- Advertisement -