రవితేజ ‘క్రాక్’ ఫస్ట్ లుక్

364
krack-poster
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కోరాజా మూవీ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈమూవీ విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ దూసుకెళ్తుంది. ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజకు ఒకరకంగా హిట్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఈమూవీ తర్వాత రవితేజ క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. రవితేజతో బలుపు సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గోపిచంద్ మలినేని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుంది. బి మధు నిర్మిస్తున్నారు. క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. తాజాగా క్రాక్ మూవీలో రవితేజ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈమూవీలో రవితేజ పోలీస్ పాత్రలో నటించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా క్రాక్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు మే 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -