మూవీ టైటిల్ లీక్‌..రష్మికపై ఆగ్రహం

312
rashmika

గీత గోవిందం హిట్‌తో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది నటి రష్మీక. డియర్ కామ్రేడ్ తర్వాత ప్రస్తుతం మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు,నితిన్‌తో భీష్మ మూవీతో పాటు కోలీవుడ్‌లోనూ సత్తాచాటుతోంది.

తమిళంలో కార్తికి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది. ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నెపోలియన్‌, యోగిబాబు, సతీష్‌, మలయాళ నటుడు లాల్‌ తదితరులు నటిస్తుండగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను త్వరలోనే భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది.

అయితే వారి ఆశలపై నీళ్లు చల్లింది రష్మీక. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సుల్తాన్ మూవీ షూటింగ్‌లో నాలుగో రోజు ఓ ఫోటోను పోస్టు చేసింది. దీంతో చిత్ర యూనిట్ రష్మీకపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. టైటిల్‌ లాంచ్‌ని సస్పెన్స్‌తో రిలీజ్ చేయాలని భావిస్తే రష్మీక ముందే అనౌన్స్ చేయడంపై చిత్ర బృందం తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.