డైరెక్టర్‌-హీరోకు హీరోయిన్‌ బెదిరింపులు..!

202

హీరోయిన్‌ రష్మిక మందన టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ స్టార్‌గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు గురించి ఒక న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తను కొత్తగా నటిస్తున్న చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్‌లను బెదిరిస్తోందట. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో ‘భీష్మ’ సినిమా రూపొందుతుంది. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో సెట్స్‌లో నితిన్‌తో కలిసి కబుర్లు చెబుతున్న ఫొటోను వెంకీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘నేను నితిన్‌ అన్న డీప్‌ డిస్కషన్‌లో ఉన్నాం. వెనక రష్మిక ఏం చేస్తోందో మాకు తెలీదు’ అని ట్వీట్‌ చేశారు.

ఇక దీన్ని చూసిన రష్మిక ఊరికనే ఉంటుందా? “య్‌… సెట్స్‌ లో మీరిద్దరూ ఎవరికీ తెలియకుండా ఏం చేస్తుంటారో చూపించమంటారా? మీ ఫొటోలు బయటపెట్టనా?” అని ఫన్నీగా బెదిరించింది.

nithin

రష్మిక కామెంట్ పై స్పందించిన వెంకీ, “ఏది పోస్ట్‌ చెయ్… మేమిద్దరం ఏం చేసేవాళ్లమో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది” అన్నాడు. వీరి సంభాషణ మధ్యకు వచ్చిన నితిన్, “సెట్స్‌ లో అయినా, బయట అయినా మేము కేవలం వర్క్ గురించే చర్చిస్తుంటాం. మీరు ఎవరితో మాట్లాడుతుంటారు?” అని ప్రశ్నించాడు.

దీనికి స్పందించిన రష్మిక, “ఏయ్‌ నితిన్‌, నువ్వు కాస్త ఆగు. తెర వెనుక ఏం జరుగుతోందో నేను చూపిస్తాను. ఎప్పటికీ మేము సింగిలే అంటుంటారు. ఆ ట్యాగ్‌ లైన్‌ నాకు మాత్రమే సూటవుతుంది” అని ఇంకో కామెంట్ వదిలింది. ఇక వీటిని చూస్తున్న నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ ట్వీట్స్ వైరల్ గా మారాయి.