ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో రష్మీక!

169
ntr rashmika

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల..వైకుంఠపురంలో సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాడు. ఈమూవీ తర్వాత త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్ స్క్రీప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. మార్చ్ నుంచి ఈచిత్రం షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ఈమూవీలో ఎన్టీఆర్ కు జోడిగా రష్మీక మందనను తీసుకున్నట్లు తెలుస్తుంది. రష్మీక మందన ఇటివలే మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టింది.

అంతేకాకుండా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా రష్మీక హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్ రష్మీక జోడిగా నటించిన భీష్మ మూవీ ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఛలో, గీతగోవిందం సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తుంది రష్మీక మందన. కాగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవిందసమేత వీరరాఘవ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుండంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ బిజీగా ఉన్నారు. జులైలో ఈమూవీ విడుదల కానుంది.