రవితేజతో మహాసముద్రంలోకి రాశీఖన్నా…!

284
ravi teja rashi khanna

డిస్కో రాజా తర్వాత మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న చిత్రం మహాసముద్రం. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా రాశీఖన్నాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో వీరిద్దరూ కలిసి బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు చిత్రాల్లో నటించారు. తాజాగా మూడోసారి రవితేజతో నటించే ఛాన్స్ కొట్టేసింది రాశీ.అజయ్ భూపతి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట రవితేజ. ఇక ఈ సినిమాకు నిర్మాతగా రామ్ తాళ్లూరి వ్యవహరిస్తున్నారు.

కొంత కాలంగా వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు రవితేజ. రాజా ది గ్రేట్ తర్వాత ఆయన చేసిన సినిమాలన్ని అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. దీంతో వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా మూవీపై భారీ ఆశలు పెట్టకున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా…. రవితేజ సరసన హీరోయిన్లుగా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్‌ నటిస్తున్నారు.