రైల్వే స్టేషన్ నుంచి బాలీవుడ్ వరకు

432
renu
- Advertisement -

ప్రతి మనిషిలో ఎదో టాలెంట్ ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. సరైన సమయానికి మన టాలెంట్ ను వినియోగించుకున్న వారే తమ గమ్యాన్ని చేరుకుంటారు. ఈమధ్య సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలుగా మారిన సంగతి తెలిసిందే. వాళ్లు చేసిన పనికి ఓవర్ నైట్ చాలా మంది స్టార్లుగా మారారు. కొద్ది రోజుల క్రింద రాజమండ్రిలో బేబీ అనే పల్లెటూరి కూలీ పాట పడి సెలబ్రెటీ అయిన సంగతి మరువక ముందే అలాంటి ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

రాణు మోండాల్ అనే మహిళ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద పాడిన పాట ఓవర్ నైట్ ఆమెను సెలబ్రిటీగా మార్చింది. పశ్చిమ బెంగాల్ లోని రాణాఘాట్ రైల్వేస్టేషన్ లో ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ అనే గీతాన్ని అత్యంత శ్రావ్యంగా ఆలపించిన రాణు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఆమెకావిషయం తెలియదు. ఆమె వస్త్రధారణ, చింపిరిజుట్టు , ఆకలితో అలమటిస్తున్న ఆమెను చూస్తే ఎవరూ నమ్మలేకపోయారు.

అలాగే చూస్తుండిపోయారు. ఓ యువకుడు మాత్రం తన మొబైల్‌లో వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. రాణు మోండాల్ ప్రతిభ బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమ్మియాను సైతం ఆకట్టుకుంది. దాంతో ఆయన రాణు మోండాల్ కు వాయిస్ టెస్ట్ చేసి తన కొత్త సినిమా ‘హ్యాపీ హార్డీ అండ్ హీర్’లో ఓ పాట పాడించాడు.

- Advertisement -