కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం

349
Kaleshwaram
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం అన్నారు రంగారెడ్డి జిల్లా అధికారులు. దాదాపు 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ కింద నిర్మించిన కాలువలు, టన్నెళ్లు, రిజర్వాయర్ లను రంగారెడ్డి జిల్లా అధికారులు     పరిశీలించారు. జిల్లా అధికారులు కాలేశ్వరం ప్రాజెక్టు రెండు రోజుల అధ్యయన యాత్ర కు వెళ్లిన సంగతి విదితమే. అధ్యయన యాత్ర లో రెండో రోజైన ఆదివారం నాడు వేములవాడ రాజా రాజేశ్వర ఆలయం దర్శనం అనంతరం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్, కోమటి బండ ప్రాజెక్ట్ లను పరిశీలించారు ఈ సందర్భంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ కార్యాలయంలో కాలేశ్వరం ప్రాజెక్ట్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు దాదాపు 80 వేల కోట్ల ప్రాథమిక అంచనాతో చేపట్టిన ఈ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షలకు పైగా కొత్త ఆయకట్టు అభివృద్ధి, మరో 18 లక్షల ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణ చేపట్టడం జరిగిందని అన్నారు.

దీనితోపాటు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు, పరిశ్రమల అవసరాలకు నీటిని మరో 30 టీఎంసీల నీటిని అందించే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు, ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన 13 జిల్లాలకు తాగు, సాగునీరు అందించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రంగ వినాయక సాగర్ ప్రాజెక్టు వద్ద 9:30 మీటర్ల వ్యాసార్థం తో దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న భూగర్భ టన్నెళ్లను చూసి అధికారులు ఆశ్చర్య వంతులఅయ్యారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ పూర్తి తో ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లా చిట్యాల వరకు గోదావరి జిల్లాలకు సాగునీరు అందించేందుకు వీలవుతుందని అధికారులు వివరించారు రెండు రోజుల లో ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతమైన కాలేశ్వరం ప్రాజెక్టు స్వయంగా చూసి ఎంతో ఆనందపడ్డామనీ జిల్లా అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -