రాంచీ టెస్టు..విజయానికి 6వికెట్ల దూరంలో భారత్‌

595
india vs southafrica
- Advertisement -

రాంచీ టెస్టులో విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది కోహ్లీ సేన. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 497/9 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ కేవలం162 పరుగలకే చాపచుట్టేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించగా రెండో ఇన్నింగ్స్‌లోనూ సఫారీల ఆటతీరులో మార్పురాలేదు. కేవలం 26 పరుగులకే కీలకమైన 4 వికెట్లను చేజార్చుకోని ఓటమి ముంగిటనిలిచింది.

సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో హజ్మా (62 ) ,జార్జ్ లిండే (37 ), బవుమా (32 ) పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా భారత బౌలర్లముందు తేలిపోయారు. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా నదీమ్, జడేజా, షమీ తలో రెండేసి వికెట్లు పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ ఉమేష్ యాదవ్,షమీ దాటికి ఆదిలోనే కీలకమైన 4 వికెట్లను కొల్పోయింది దక్షిణాఫ్రికా. ఇప్పటికే రెండు టెస్టుల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న దక్షిణాఫ్రికా మూడోటెస్టులోనూ పరాజయం దిశగా అడుగులేస్తోంది.

- Advertisement -