నాని సినిమా రీమేక్ లో రానా

292
nani-rana-jersey
- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో రానా దగ్గుబాటి. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తునే మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహిరిస్తూ కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో ‘క్షణం’ దర్శకుడితో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న రానా, త్వరలో ‘ఓ.. బేబీ’ని హిందీలో రీమేక్ చేస్తానని ప్రకటించాడు.

బాలీవుడ్ లో రానాకు మంచి ఫేమ్ ఉండటంతో ఈమూవీని అక్కడ విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఇక తాజాగా మరో తెలుగు సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు రానా. నాని హీరోగా నటించిన జెర్సీ మూవీని తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది.

ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించగా.. దిల్ రాజు, అల్లు అరవింద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓ వైపు నటుడిగా చేసుకుంటునే మరో వైపు నిర్మాణ రంగంలో దూసుకుపోతున్నాడు రానా. ఈసినిమాకు సంబంధించిన పూర్తి విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -