నాగ్ అశ్విన్ – ప్రభాస్‌ మూవీ అప్ డేట్స్..!

329
prabhas
- Advertisement -

ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఒక సినిమాని డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఆసక్తికర కాంబినేషన్ ను సాధ్యం చేసిన సంస్థ వైజయంతీ మూవీస్. నాగ్ అశ్విన్ వినిపించిన కథ బాగా నచ్చి, ఆయన దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి ప్రభాస్ అంగీకరించారు. ఇప్పటివరకూ చేయని తరహా పాత్రలో, ఒక కొత్త జానర్‌లో ప్రభాస్‌ను నాగ్ అశ్విన్ చూపించనున్నారు.

ట్విట్టర్‌లో ప్రభాస్ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందన్నారు. పాన్ ఇంటర్నేషనల్ మూవీగా సినిమా తెరకెక్కుతోందని కరోనా వాళ్ళ కొన్ని ఆలస్యం అయ్యాయి… కానీ స్క్రిప్ట్ కి ఎక్కువ సమయం పడుతుందన్నారు. అలాగే కాస్టింగ్ ఆలోచనలు ఉన్నాయి కానీ ఎవరిని సెలక్ట్ చేయలేదు దానికి ఇంకా టైం ఉంది అని అశ్విన్ సమాధానం ఇచ్చారు.

2021 చివర్లో కాకుండా 2022 ఏప్రిల్ లో సినిమా విడుదల చేస్తాం అని తెలిపారు నాగ్ అశ్విన్.

- Advertisement -