‘రామ చ‌క్క‌ని సీత’ మూవీ ట్రైల‌ర్‌

584
RamaChakkani setha
- Advertisement -

క్రొకోడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రామ‌చ‌క్క‌ని సీత‌. ఈ చిత్రంతో శ్రీ‌హ‌ర్ష మండా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. శ్రీ‌మ‌తి విశాలాక్షి మండా, జి.ఎల్‌.ఫ‌ణికాంత్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రా, సుక్రుతావేగ‌ల్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను నేడు ప్ర‌సాద్‌ల్యాబ్‌లో బి.గోపాల్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు.

ద‌ర్శ‌కుడు శ్రీ‌హ‌ర్ష మాట్లాడుతూ… ముందుగా నేను దాస‌రి కిర్‌ణ్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డ‌కు విచ్చేసిన పెద్ద‌లంద‌రికీ థ్యాంక్స్‌. ఈ సినిమా తీసిన ఫ‌నీంద్ర నా ఫ్రెండ్ న‌న్ను. నా కోసం ఈ సినిమాని తీశాడు. హీరో హీరోయిన్లు ఈ సినిమా ద్వారా తొలిప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్‌లో మీ ముందుకు వ‌స్తుంది అని అన్నారు.

హీరో ఇంద్ర మాట్లాడుతూ… ముందుగా ఇక్క‌డ‌కి విచ్చేసిన పెద్ద‌ల‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. రామ చ‌క్క‌ని సీత ఈ చిత్రం గ‌త సంవ‌త్స‌రం ఇదే టైంకి మేము షూటింగ్‌లో ఉన్నాం. ఈ సంవ‌త్సం సినిమాని పూర్తి చేసుకుని మీ ముందుకు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చూసిన ట్రైల‌ర్ మీ అంద‌రికి న‌చ్చి ఉంటుంద‌ని అనుకుంటున్నాను. ఈ సినిమా అంతా ఒన్‌మ్యాన్ షో క్రెడిట్ మొత్తం డైరెక్ట‌ర్‌దే. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. మా యూనిట్ అంద‌రూ చాలా కో-ఆర్డినేట్‌గా ప‌నిచేశారు. అంద‌రికీ చాలా చాలా థ్యాంక్స్‌. రైట‌ర్ విస్సూగారు నా ఫ్యామిలీ మెంబర్‌లాంటివారు మొద‌టినుంచి ఈ సినిమాకి చాలా హెల్ప్ చేస్తూ వ‌చ్చారు. అంద‌రికీ చాలా థ్యాంక్స్ అన్నారు.

హీరోయిన్ మాట్లాడుతూ… క‌న్న‌డ‌లో నేను 7చిత్రాల్లో న‌టించాను. తెలుగులో ఇదే నా మొద‌టి చిత్రం. క‌న్న‌డ ప్రేక్ష‌కులు న‌న్ను ఆద‌రించిన‌ట్లే తెలుగులో కూడా ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను. న‌న్ను ఈ సినిమాకి హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నందుకు హ‌ర్ష‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. నేను ఇంత బాగా తెలుగు మాట్లాడ‌డానికి మొద‌టి కార‌ణం మా డైరెక్ట‌ర్ టీం అంతా బాగా హెల్ప్ చేశారు. నేను మీ ముందు ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మా ప్రొడ్యూస‌ర్ ఫ‌ణిగారు ఆయ‌న‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. ఆలాగే మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన మా గెస్ట్‌లంద‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

- Advertisement -