వినాయక్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్

289
Ram VV Vinayak

ఎనర్జీటిక్ స్టార్ రామ్ పొత్తినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా బాక్సాఫిస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈమూవీలో రామ్ మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు. చాలా రోజుల తర్వాత రామ్ కు సరైన హిట్ రావడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. దీంతో రామ్ తన తర్వాతి మూవీ ఎవరితో చేస్తాడన్నది టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రామ్ తన తర్వాతి మూవీ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయవలసి ఉంది. తాజాగా ఉన్న సమచారం ప్రకారం రామ్ వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటివలే వినాయక్ రామ్ కు మంచి మాస్ స్టోరీని వినిపించాడట. కథ నచ్చడంతో రామ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మొదట వినాయక్ తో సినిమా చేసిన తర్వాత కిషోర్ తిరుమలతో చేయాలని నిర్ణయించుకున్నాడట.

వీవీ వినాయక్ కూడా హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా మొదలుకావడానికి ఇంకా చాలా సమయం వుంది. అందువలన ఈ లోగా దర్శకుడిగా మరో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన రామ్ కి ఒక కథ వినిపించాడట. ఈసినిమాకు సంబంధించిన పూర్తీ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.