‘రాం నాయక్’ చిత్రం ప్రారంభం

191
Ram Naik

రమేష్ చౌహాన్, శుభాంగి హీరోహీరోయిన్లుగా, శ్రీ తుల్జా భవానీ ఫిల్మ్ సిటీ బ్యానర్‌పై శ్రీమతి లక్ష్మీ చౌహాన్ నిర్మిస్తున్న చిత్రం ‘రాం నాయక్’. కపిల సుబ్బారావు దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు రమేష్ చౌహాన్ మాట్లాడుతూ.. బంజారా భాషలో నిర్మింపబడుతున్న ఈ చిత్రంలో మొత్తంగా 5 పాటలు ఉంటాయి. ఈ పాటలన్నీ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకునేలా ఉంటాయి. సంగీత దర్శకులు భోలేషావలి ఈ పాటలకు ప్రాణం పోశారు. దర్శకుడు కపిల సుబ్బారావు అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తప్పకుండా అందరినీ ఆకట్టుకునే చిత్రమవుతుంది..’’ అన్నారు.

సంగీత దర్శకుడు భోలేషావలి మాట్లాడుతూ.. గతంలో సూపర్ హిట్ అయిన బంజారా చిత్రం ‘గోర్ జీవన్’ తర్వాత అంతగా మనసు లగ్నం చేసి ఈ చిత్ర పాటలకు బాణీలను సమకూర్చాను. తప్పకుండా ఈ చిత్రం మ్యూజికల్ హిట్ అవుతుంది. నాకు మంచి పేరు తీసుకువచ్చే చిత్రమవుతుంది.. అని అన్నారు.

చిత్ర దర్శకుడు కపిల సుబ్బారావు మాట్లాడుతూ.. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మార్చి 3 నుంచి ప్రారంభమవుతాయి. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాలలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేశాము. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటుగా చక్కని డైలాగులు, అందమైన లొకేషన్లు కూడా ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తాయి. అని చెప్పారు.