ట్రంప్ భారత్ పర్యటనపై ఆర్జీవీ కామెంట్

206
RGV-and-Donald-Trump

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దేశ రాజధాని ఢిల్లీలో పలు ఏర్పాట్లు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 24న భారత్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. భారత్ పర్యటనలో నేపథ్యంలో తనను ఆహ్వానించేందుకు మిలియన్ల మంది భారత ప్రజలు వస్తారని వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రధాని మోదీ స్వయంగా తెలిపారన్నారు.

ఇక ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇండియాలో ట్రంప్ ను 10మిలియన్ల ప్రజలు ఆహ్వానించాలంటే ఒకటే దారి ఉంది. ట్రంప్ తో పాటు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, సన్నీ లియోన్ లను నిల్చోబెడితే అది సాధ్యమే’ అంటూ వర్మ కామెంట్ చేశాడు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.