ఇస్మార్ట్ శంకర్ కోసం ముసాపేట్ కు వర్మ

94
Rgv On bike For Ismart Shankar

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జీటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈనెల18న విడుదలైన ఈచిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. పక్కా మాస్ ఎలిమెట్స్ తో తెరకెక్కించిన ఈచిత్రంలో నభా నటేశ్, నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటించారు. అయితే తాజాగా ఈసినిమాను బైక్ పై వెళ్లి చూశారు పూరీ జగన్నాథ్ గురువు సన్సెషన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

బుల్లెట్ బైక్ పై ఆర్ ఎక్స్ దర్శకుడు అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు అగస్త్య ముగ్గురు కలిసి మాస్ లుక్ లో వచ్చి ముసాపేటల ఉన్న శ్రీరాములు థియేటర్ లో మధ్యాహ్నం షోలో సినిమాను చేశారు. ప్రేక్షకులతో కూర్చోని ఆయన సినిమాను ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలను వర్మ తన ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. సినిమాను ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు.

ఈఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు వర్మ వెళ్తున్న బైక్ పై ముగ్గురు ఉండగా ఆపై బైక్ నడిపే వ్యక్తికి హెల్మెంట్ కూడా లేదు. దీంతో కొంత మంది ఆయనపై ఫైర్ అవుతున్నారు. సెలబ్రెటీ అయివుండి ఒకే బైక్ పూ ముగ్గురు వెళ్తూ.. పైగా హెల్మెంట్ కూడా లేదని పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి వర్మపై పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో.