‘కొదమసింహం’ లుక్‌లో అదరగొడుతున్న చరణ్‌..

296
Ram Charan
- Advertisement -

దర్శకదీరుడు రాజమౌళి ఎన్టీఆర్‌,రాంచరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం RRR.ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. ఈ చిత్రానికి ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక కాళుకు గాయం కారణంగా సుమారు రెండు నెలలు రెస్ట్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భార్యతో ఆఫ్రికా టూర్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్‌కి సంబంధించిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే చరణ్‌ పోస్ట్‌ చేసిన ఓ ఫోటో తెగ వైరల్‌ అవుతుంది. అంతగా వైరల్‌ అవ్వడానికి అంత స్పెషల్‌ ఎంటనుకుంటున్నారా.. అయితే మీరే చూడండీ.

ఈ ఫోటోలకు ‘కొదమసింహం’ అన్న ట్యాగ్ లైన్ తగిలించడమే స్పెషల్. చిరంజీవి కెరీర్‌లో ‘కొదమసింహం’ ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా రామ్ చరణ్ ఫోటోలకు ఆ ట్యాగ్ లైన్ జోడించడంతో, చరణ్ తదుపరి చిత్రం పేరు అదేనా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ అహ్మదాబాద్‌లో జరుగుతుండగా జిమ్‌లో ప్రమాదానికి గురైన చెర్రీ ఎట్టకేలకు పూర్తిగా కోలుకున్నాడు. త్వరలో చరణ్‌ మళ్ళీ RRR ష్యూటింగ్‌కి సిద్ధమౌతున్నాట్లు తెలుస్తోంది.

- Advertisement -