అమ్మకు అంకితమిచ్చిన రాంచరణ్‌..

97
ramcharan

మెగాస్టార్‌ తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ఇన్స్టాగ్రామ్‌లో ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తన ఖాతాలో ఒక ఫోటో ఉన్నప్పటికీ అది ప్రొఫైల్ పిక్. ఈ రోజు తన ఇన్స్టా ఖాతా ద్వారా ఫస్ట్ పోస్ట్ పెట్టాడు. అమ్మ సురేఖతో కలిసి ఉన్న..”అప్పుడు ఇప్పుడు” టైపు ఫోటోను పోస్ట్ చేశాడు.

ఒకటేమో చరణ్ చిన్నబాబుగా ఉన్నప్పుడు.. రెండో ఫోటో లేటెస్ట్. కంపారిజన్ పిక్ లాంటిది. ‘కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు!! నా మొదటి పోస్టు నీకే అంకితం చేస్తున్నా. లవ్‌ యూ అమ్మా’ అంటూ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా తండ్రి చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా ప్రొడక్షన్‌ పనులతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.