ఇన్ స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్‌స్టార్‌..!

288
ramcharan
- Advertisement -

సినీ సెలబ్రెటీలకు ఫేస్‌బక్‌,ట్విట్టర్‌,ఇన్‌ స్టాగ్రామ్‌లతో ఎంతో అవసరం ఉంటుంది. తమ సినీ విశేషాలను భారీస్థాయిలో ప్రచారం చేసుకునేందుకు సామాజిక మాధ్యమాన్ని మించిన సాధనం లేదు. అందుకే చాలామంది అగ్ర తారలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో క్రియాశీలకంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.

తాజాగా, టాలీవుడ్ మెగాహీరో రామ్ చరణ్ కూడా ఇన్ స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్‌లో ఆల్వేస్ రామ్ చరణ్ అంటూ ఖాతా తెరిచారు. దాంట్లో ఇప్పటివరకు తన ప్రొఫైల్ పిక్ ను మాత్రం పోస్టు చేశారు. ఆయన ఖాతా ప్రారంభించిన కొద్దిసేపట్లోనే 16.7 వేలమందికి పైగా అనుసరించడం మొదలుపెట్టారు. ఇన్ స్టాగ్రామ్ కూడా ఆ అకౌంట్ ను వెరిఫై చేయడంతో అది నిజంగా రామ్ చరణ్ అకౌంటేనని అర్థమవుతోంది.

https://www.instagram.com/p/BzpbQsNHFXQ/?utm_source=ig_embed

- Advertisement -