అమితాబ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదుః రామ్ చరణ్

190
Ram-Charan

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సైరా. స్వాతంత్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మించారు. బిగ్ బి అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, నయనతార, తమన్నాలు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

ఇక ఈసినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈ ఈకార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజమౌళిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఇక ఆడియో ఫంక్షన్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఇందులో అమితాబ్ బచ్చన్ నటించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆయన గురించి అందరికి ఒక విషయం చెప్పాలి. ఈసినిమాలో నటించింనందుకు అమితాబ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయనకు స్పెషల్ ఫైట్ అరెంజ్ చేసినా..క్యాన్సల్ చేపించి తన సొంత ఖర్చులతో షూటింగ్ కు వచ్చారు. కేవలం చిరంజీవి మీద ఉన్న గౌరవంతోనే ఆయన ఇలా చేశారన్నారు.