బిగ్ బాస్‌లోకి రకుల్‌..!

489
- Advertisement -

తెలుగు బిగ్ బాస్ 3 సీజన్ హోస్ట్‌గా నాగార్జున బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ లాంటి షోస్ ద్వారా బుల్లితెర పాపులారిటీ తెచ్చుకున్న ఈ వెండితెర హీరో.. ఈ సారి బిగ్ బాస్‌గా అలరిస్తున్నాడు. ఈ షో ప్రారంభానికి ముందు పలు వివాదాలు చుట్టుముట్టినా, నాగ్ ఇంటి ముందు ధర్నాలు చేసినా కూడా అవేవీ బిగ్ బాస్‌ని ఆపలేకపోయాయి. ఇకపోతే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు నాగార్జున బిగ్ బాస్ లోకి రకుల్ ప్రీత్ సింగ్‌ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.

nag

రకుల్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతోంది. తన తాజా చిత్రం ‘మన్మథుడు 2’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హౌస్‌లోకి రానుంది. ఆమెతో పాటు చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా హౌస్‌లోకి ఎంటర్ కానున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ నటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ‘మన్మథుడు 2’ చిత్రం విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

- Advertisement -