ముంబైలో వరదలు.. కష్టాల్లో రకుల్‌..!

388
Rakul Preet
- Advertisement -

గత ఐదు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తాయి. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్థంభించింది. కనీస సౌకర్యాలు తీర్చుకోవడానికి కూడా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. మరోవైపు శిధిలావస్థకు చేరిన భవనాలు కూలుతున్నాయి.

ముంబైతోపాటు, కళ్యాణ్, పుణెలలో సంరక్షణ గోడలు కూలడంతో సుమారు 22మంది మరణించారు. భారీ వర్షాలకు రోడ్డు, రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇంకో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Rakul Preet

ఈ ప్రభావం సెలబ్రిటీలపై కూడా గట్టిగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ తారలు షూటింగ్‌లు, ప్రయాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ముంబైలో వరదల కారణంగా సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విమానాశ్రయంలో చిక్కుకుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా తెలిపింది. “ముంబై ఎయిర్‌ పోర్ట్‌ తెరిచి ఉందో లేదో ఎవరైనా సమాచారం అందిస్తారా?” అంటూ బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేయగా, దానికి రకుల్ సమాధానం ఇచ్చింది.

సోమవారం రాత్రి నుంచి ఒక్క విమానం కూడా కదల్లేదని, తాను ఎయిర్‌ పోర్ట్‌ లోనే ఉన్నానని చెప్పింది. కాగా, కుంభవృష్టి కారణంగా ముంబైకి వెళ్లాల్సిన పలు విమానాలను దారి మళ్లించగా, మరికొన్ని గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.

Rakul Preet

- Advertisement -