వయసుతో సంబంధం లేదు ఎవరైనా ఓకే.. రకుల్‌

45
Rakul Preet Singh

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. అజయ్ దేవగన్ సరసన ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో 26 ఏళ్ల రకుల్ యాభై ఏళ్ల అజయ్ ప్రేయసిగా నటించారు.

Rakul Preet Singh

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రకుల్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రకుల్ ని ‘నిజ జీవితంలో మీ కన్నా వయసు బాగా ఎక్కువ ఉన్న వ్యక్తిని ప్రేమిస్తారా..?’ అని ప్రశ్నించగా.. దానికి ఆమె ఇచ్చిన సమాధానం వింటే షాకవ్వల్సిందే.! ‘నిజ జీవితంలో నేను ప్రేమలో పడేందుకు ఎదురుచూస్తున్నా.. ఆ వ్యక్తి వృద్ధుడా..? లేదా యువకుడా..? అనేది అనవసరం’ అంటూ చెప్పుకొచ్చింది. ఓ బంధాన్ని ఎవరూ నెంబర్లతో నిర్వచించడం లేదని, వయసుతో సంబంధం లేకుండా ఓ మంచి జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నారని.. ఈ సినిమాలో కూడా అదే విషయాన్ని చూపించినట్లు చెప్పుకొచ్చింది.