రానాతో లవ్ ఎఫైర్.. రకుల్ క్లారిటీ..!

249
Rakul prith
Rakul prith

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాతో రకుల్ ప్రీత్ సింగ్ లవ్‌ ఎఫైర్ నడుస్తోందంటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా రానా అనారోగ్యం గురించి విపరీతమైన ప్రచారం సాగించిన అదే వేదికపై అతడి లవ్ ఎఫైర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. రానా ఇంటి పక్కనే రకుల్ ఇల్లు ఉండడంతో ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం విపరీతంగా పెరిగిందిట. ఆ ఇద్దరూ సీక్రెట్ గా లవ్ ఎఫైర్ సాగిస్తున్నారని ప్రచారమవుతోంది.

దీనిపై తాజాగా రకుల్‌ క్లారీటి ఇచ్చింది. రానాకు, తనకు మధ్య ప్రేమ ఉందన్న వార్తలు అవాస్తవమని చెప్పింది. తామిద్దరి ఇళ్లు కేవలం రెండు నిమిషాల్లో వెళ్లేంత దగ్గరగా ఉంటాయని, తాను సినిమాలకు పరిచయం కాకముందు నుంచే రానా తెలుసునని చెప్పింది. ఇద్దరమూ ఎన్నడూ డేటింగ్ కు వెళ్లలేదని, రానా మరో యువతితో ప్రేమలో ఉన్నాడని రకుల్ వ్యాఖ్యానించారు.

rakul

తాము స్నేహితులుగానే ఉన్నామని, రానా సహా తన హీరోలందరితో అలాగే ఉన్నానని అంది. ఇంతవరకూ తాను ఎవరితోనూ లవ్ లో పడలేదని, ఇంకా సింగిల్‌ గానే ఉన్నానని రకుల్ అంటోంది. ప్రస్తుతం అవకాశాలు తగ్గి, స్పెషల్ ఫోటో సెషన్స్ చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న రకుల్, తానే అవకాశాలు తగ్గించుకున్నానని చెబుతోంది.