ఆ విషయంలో పదిసార్లు ఆలోచిస్తా: రకుల్

269
rakul

ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు పూర్తిచేసుకుంది బ్యూటీ క్వీన్‌ రకుల్ ప్రీత్ సింగ్. తన గ్లామర్ షోతో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్న రకుల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. నాగ్‌తో మన్మథుడు 2లో తన కెరీర్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయిన రకుల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఈ నేపథ్యంలో తన మనసులోని మాటను బయటపెట్టింది రకుల్. ఓ విషయాన్ని ఎవరు చెబుతున్నారు? ఏ మాధ్యమం ద్వారా చెబుతున్నారు? అనేది చాలా ముఖ్యం…అయితే సినీ ఆర్టిస్టులకు సినిమా కంటే గొప్ప మాధ్యమం లేదు. ఏం చెప్పాలనుకున్నా, సినిమానే సాధనంగా వాడుకోవాలని సూచించింది.

సినిమా వాళ్లు ఏం చెప్పినా జనాలకు క్షణాల్లో చేరిపోతుందని…. అలాంటప్పుడు ప్రతి మాటనీ ఆచి తూచి వాడాలని సూచించింది. తాము ఎంచుకునే కథల ద్వారానే ప్రేక్షకుల్ని చైతన్యవంతులం చేయొచ్చు. అందుకే తెరపై ఎలాంటి మాట మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా అని చెప్పింది.

ప్రస్తుతం రకుల్, కమల్ హాసన్, శంకర్‌ల ఇండియన్2 లో ముఖ్యపాత్రలో నటిస్తోంది. మరోవైపు వెంకటేష్ హీరోగా ‘దే దే ప్యార్ దే’ రీమేక్‌లో, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.