రేటు పెంచిన రకుల్..

248
Rakul Preet Singh hikes her remuneration
- Advertisement -

ఇటు తెలుగులోను.. అటు తమిళ్ లోనూ ఒకే భారీ చిత్రంతో సత్తా చాటే అరుదైన అవకాశం రకుల్ ప్రీత్ కు వచ్చింది. ఇప్పటివరకూ తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామకు.. ఇప్పుడు తమిళ్ నుంచి కూడా బోలెడన్ని పిలుపులు వస్తున్నాయట. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్.తన అందచందాలతోనే కాకుండా, యాక్టింగ్ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేస్తూ తన డిమాండ్ ను పెంచుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే. ఆమె నటించిన ‘స్పైడర్’ సినిమా రేపు విడుదలవుతోంది. మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Rakul Preet Singh hikes her remuneration

స్పైడర్ తర్వాత రకుల్ ప్రీత్ తన రెమ్మునరేసన్ ను భారీగా పెంచేసిందట. ఇటీవల తన వద్దకు వచ్చిన ఓ నిర్మాతను రూ. 2.5 కోట్లు డిమాండ్ చేసిందట. స్పైడర్ మూవీ ప్రమోషన్ టైమ్ లో కూడా పలువురు తమిళ డైరెక్టర్లు ఈ అమ్మడుని కలిశారట. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా వారు సిద్ధమయ్యారట.

నిజానికి గత కొన్నాళ్లుగా రకుల్ కొత్త సినిమాలు సైన్ చేయడం లేదు. స్పైడర్ రిలీజ్ వరకూ ఆగి అప్పుడు పారితోషికం విషయంలో డెసిషన్ తీసుకోవాలన్నది అమ్మడి ఆలోచన. ఇప్పటికే స్పైడర్ ట్రెండ్ గురించి ఫుల్ పాజిటివ్ బజ్ వచ్చేసింది. అందుకే తన మనసులోని రెండున్నర కోట్ల మాటను.. ఇలా మెల్లమెల్లగా బయటపెడుతోందట. ఇప్పటివరకూ కోటిన్నరకు అటూఇటూగా తీసుకునే రకుల్ ని ఇప్పుడు మూవీలోకి తీసుకోవాలంటే.. నిర్మాతలు రెండున్నర కోట్లు చదివించుకోవాల్సిందే.

- Advertisement -