కిస్‌ ఇచ్చిన రకుల్..ఎవరికో తెలుసా..!

189
rakul

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈమూవీ విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో బిజీగా ఉంది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు జిమ్‌ సెంటర్‌లను ఏర్పాటుచేసి రెండుచేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమా చేస్తున్న రకుల్ ముంబైలో బిజీగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో బాద్రా ఏరియాలో జిమ్ కు వెళ్లి వస్తున్న రకుల్ కు ఇటీవలే తూనీగా తూనీగ సినిమా హీరోయిన్ రియా చక్రవర్తి కనిపించింది. ఇద్దరు కుశలప్రశ్నలు వేసుకున్నారు. ఆ తరువాత కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.